రాజమండ్రిలో బ్రాహ్మణితో జనసేన పార్టీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మీవెంట మేమున్నాం అనే భరోసాను కల్పించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తు రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.