in ,

పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజును విమర్శించేస్థాయిగుప్తకులేదు

🔷 *పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజును విమర్శించే స్థాయి గుప్తాకు లేదు..!*

💥 *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ..*

 👉 రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారిని విమర్శించే స్థాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా కు లేదని ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ అన్నారు.

👉కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరుణాకర్ బాబు గారి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ……. పీసీసీ అధ్యక్షుల పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో మీరు కానీ మీ స్థాయి కానీ ఎవరికీ తెలియదని అలాంటిది పీసీసీ అధ్యక్షులను విమర్శించడం సరికాదని అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాటించాలని క్రమ శిక్షణతో పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పేరు దిగజారేలా చేయకుడదన్నారు. పార్టీ అధిష్టానం సత్యనారాయణ గుప్తాపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Written by G.Raju

పీసీసీ గిడుగు రుద్రరాజును విమర్శించేస్థాయిగుప్తాకులేదు

భారీ ర్యాలీ, అభినందన సభను జయప్రదం చేయండి.