ఆదోనిలోని మార్కెట్ యార్డ్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఆదోని డీటు ఏఈ శారద విలేకరులకు తెలిపారు. మరమ్మతు పనులు జరుగుతున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రీస్, రైస్ మిల్లుల యాజమానులు, ప్రజలు, విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.