రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ డిమాండ్ చేశారు. ఆదోనిలో జరిగిన కార్యక్రమంలో హాజరై ఆమె మాట్లాడుతూ….. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యం పై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున తక్షణమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యం అందించాలన్నారు.