in ,

జర్నలిస్టులు పై దాడులను అరికట్టాలి.

ఆదోని: ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్ ) కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి వసతి గృహమునందు సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు రఘు మాట్లాడుతూ………… రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రతి  వర్కింగ్ జర్నలిస్టులకు  ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విలేకరులకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్న ఆదోనిలో విలేకరులకు పట్టాలు పంపిణీ చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి విలేకరులకు ఇంటి పట్టాల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ పట్టణ అధ్యక్షులు సురేష్, ఉప అధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి,  కార్యదర్శి చంద్ర శేకర్ ,ఈరన్న ,చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Written by G.Raju

ఉచితంగా బాక్సింగ్ వెపన్స్ పంపిణీ.

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి.