చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేషనల్ విద్య సంస్థల అధినేత గోపాల్ రెడ్డి ఆదోనిలో ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. క్రీడ కోటలో విద్యా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు ఉన్నారన్నారు. త్రో బాల్ నిహారిక, సపక్ తక్రా కౌశల్, టెన్నికాయిట్ ఫర్హాన్, అండర్ 17 విభాగంలో క్రికెట్ సుష్మ ఎంపికయ్యారని తెలిపారు.