ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు బీటుగా ఫలితాలు సాధిస్తున్నారని ఏపీఎంటిఎఫ్ పట్టణ నాయకులు అనిల్ కుమార్, జంగం బసవరాజు అన్నారు. గురువారం ఆదోని లోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు హెచ్ఎం అలీమ్ సిద్ధిఖీ, రవిల చేతుల మీదుగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దస్తగిరి, ఆనంద్, రమేష్ రావు, విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు.