తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యాహ్నం తీర్పు
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. ఇటీవల విచారణ చేపట్టిన విజయవాడలోని ఏసీబీ కోర్టు.. తీర్పును నేటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.