ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు బోయ మహానంది, రమేష్, గొల్ల బీమా, అనే ముగ్గురిని సిరుగుప్ప రోడ్డు లోని టిడ్కో గృహాల వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకుని వారి వద్ద నుండి రూ. 3 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని వన్ టౌన్ సిఐ విక్రమ సింహ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అదేవిధంగా 25 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామన్నారు.