ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీన సామర్లకోట వస్తున్నట్లు ముఖ్యమంత్రి అదనపు పర్సనల్ సెక్రటరీ కె.నాగేశ్వరరెడ్డి నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు జిల్లా సమాచార శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12న తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సామర్లకోట-పెద్దాపురం రోడ్డులోని ప్రెవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గంలో ప్రత్తిపాడు రోడ్డులోని జగనన్న లేఅవుట్‌కు చేరుకుంటారు. ఈటీసీ లేఅవుట్లోని జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఐదు లక్షల ఇళ్లను సామూహిక గృహ ప్రవేశాల ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం జగనన్న కాలనీ ప్రదేశంలో ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంస్య విగ్రహన్ని ఆవిష్కరిస్తారు. జగనన్న కాలనీ నుంచి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ ప్రదేశానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి రోడ్డు మార్గంలో పెద్దాపురం రోడ్డులోని హెలిఫ్యాడ్ ప్రదేశానికి చేరుకొని తాడేపల్లి వెళతారు.ఇప్పటికి మూడు పర్యాయాలు అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది.