తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోట మండలం అచ్చంపేట నుండి పెద్దాపురం మండలం తొలి తిరుపతి కు పాదయాత్ర ను శనివారం ఉదయం చేపట్టారు. ఈ పాదయాత్ర కు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, అనపర్తి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వర్మ లు సంఘీభావం గా మద్దతును తెలియజేశారు. అచ్చంపేట ఉండూరు, సామర్లకోట రాగంపేట, వడ్లమూరు,పులిమేరు,డివిలి మీదుగా తొలి తిరుపతి కు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కేసు నుండి బయటకు రావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ శృంగార వల్లభ స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు