in ,

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సందర్శించిన ప్రభుత్వ విప్ చిర్ల

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేయించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు కొత్తపేట నియోజకవర్గంలో దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ సచివాలయం-1 పరిధిలో మరియు ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం1 పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఆయన సందర్శించారు.

ఈ క్యాంపుల వద్ద ప్రజలకోసం ఏర్పాటు చేసిన మందులను, అక్కడ వారికి అందిస్తున్న సేవలను పరిశీలించారు. మాతా శిశు సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోష్టికాహార స్టాల్స్ ను సందర్శించి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు, నవజాత శిశువులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు

Written by Kiran

రాక్షస పాలనను అంతమొందించేది అప్పుడు అమ్మవారు ఇప్పుడు చంద్రబాబు

విశాఖ బహిరంగ సభ ను జయప్రదం చేయండి