డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మహిసాసుర మర్ధని రూపంలో వున్న అమ్మవారు రాక్షస రూపంలో వున్న పాలనను అంతమోదిస్తున్నట్లు వినూత్న రీతిలో నిరసన.
రాక్షస పాలనను అంతమొందించింది మహిసాసురవర్ధిని రూపంలో అమ్మవారు అని రాష్ట్రంలో జగన్ పాలనను అంతమొందించేది తెలుగుదేశం పార్టీనేనని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.
చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ రావులపాలెం నందు 21వ రోజు క్లస్టర్ – 9 (మడికి, చెముడులంక, బడుగువానిలంక, చొప్పెల్ల,మూలస్థానం,నర్సిపూడి, మోదుకూరు,నవాబుపేట గుమ్మిలేరు) గ్రామాల వారు మరియు సాంస్కృతిక విభాగం వారు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
ఆనాడు దేవతలు చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల రాక్షసుల పాలనలో దేవతలే అనేక ఇబ్బందులు పడ్డారని, ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కిన జగన్మోహనరెడ్డి పాలన రాక్షస పాలనను మించిపోయిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ దుర్బరమైన, ఘోరమైన రాక్షస పాలన అంతమొందాలంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావలసిన అవసరం కచ్చితంగా వుందని సత్యానందరావు అన్నారు.
ఈకార్యక్రమంలో క్లస్టర్ – 9 (మడికి, చెముడులంక, బడుగువానిలంక, చొప్పెల్ల,మూలస్థానం,నర్సిపూడి, మోదుకూరు,నవాబుపేట గుమ్మిలేరు) గ్రామాల వారు మరియు సాంస్కృతిక విభాగం వారు, కొత్తపేట నియోజకవర్గ నాయకులతో పాటు రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.