విద్యారంగ సమస్యలు పరిష్కారానికై సెప్టెంబరు 30వతేది ఎస్ఎఫ్ఎస్ఐ చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసువారి ముందస్తు నోటీసులు అందజేశారని గుంజ మదన్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గుంజ మదన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల మొద్దునిద్ర పోతుందన్నారు. అసెంబ్లీ జరిగిన ఐదు రోజుల్లో విద్యార్థుల సమస్యల గురించి ఊసెత్తలేదని వాపోయారు. నాలుగున్నరేళ్ళ నిమ్మ కాలంలో ఇచ్చిన హామీలు మాటలకే తప్ప అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. పథకాల అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి పధకాలలో ఎందుకు కోతలు విధించారో సమాధానం చెప్పాలని కోరారు. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. మధ్యాహ్న భోజన పధకాన్ని నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. డిగ్రీ విద్యలో 2018 నాటికి 3లక్షలు ఉండాల్సిన అడ్మిషన్లు 2023 విద్యా సంవత్సరానికి లక్షా 20వేలకు తగ్గడానికి ప్రభుత్వం విధానాలే కారణమని అన్నారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఎలాంటి ఆటంకాలు సృష్టించిన తమ పోరాటాన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలిపారు.