ప్రపంచ హృదయ దినోత్సవము సందర్భముగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ మరియు జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఆధ్వర్యములో నిర్వహించిన CPR ట్రైనింగ్ ప్రోగ్రాం కు 890 మందికి పైగా CPR ట్రైనింగ్ నేర్పించడం జరిగింది. CPR ట్రైనింగ్ ఫర్ ఎవరీ వన్ అనే స్లోగన్ తో సుమారుగా 2500 మందికి కాకినాడ జిల్లా వ్యాప్తముగా CPR ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చి ప్రాణాలు కాపాడుటకు కృషి చేస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వారిని జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్ డా P V ప్రసాద రాజు యూనివర్సిటీ తరఫున వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు.