in ,

సమగ్ర శిశు సొసైటీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.

నర్సీపట్నం. సమగ్ర శిక్ష సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు.  ఈ సందర్భంగా నర్సీపట్నం ఆర్డిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నా సమగ్ర శిక్ష సొసైటీ ఉద్యోగులకు  బీఎస్పీ పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్లకు సంఘీభావంగా ఆర్డిఓ ఆఫీస్ దగ్గరికి నిరసనలోను పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొట్టా నాగరాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష సొసైటీ లో  పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అండగా ఉంటామని అలాగే ఏ కార్యక్రమం చేసిన మద్దతు ఇస్తామని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ పాదయాత్రలో అనేక హామీలు వర్షం కురిపించడం జరిగిందని, దాంట్లో భాగంగానే ఈ ఉద్యోగులకు కూడా క్రమబద్ధికరిస్తామని, ప్రతి నెల జీతం ఇస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని,  సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాడి 4సం. లు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలలో ఒక్కటికూడా అమలు చెయ్యలేదని,త ఇచ్చిన హామీలు అమలు  ఇచ్చిన హమీలన్నీ తెడ్డు దాటిన తర్వాత బోడు మల్లన్న అనే విధంగా ఉందని, జీతాలు ప్రతినెల ఇవ్వకుండా, పని ఒత్తిడి పెంచుతూ నానా రకాలుగా ఉద్యోగులును ఇబ్బంది పెడుతున్నాడని,. గతంలో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ఏ గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డి కి  కూడా అదే గతి తప్పదని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి, మాట నిలబెట్టుకోవాలని,సమగ్ర శిక్ష సొసైటీ ఉద్యోగాలను క్రమబద్ధికరణ చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ బిఎస్పి కన్వీనర్ కొల్లు గంగాధర, బహుజన ఐక్య వేదిక నాయకులు రాజు మరియు అనేకమంది ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

Written by N.Chiranjeevi

అక్టోబర్ ఒకటి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష

ఉరితాడుతో టీడీపీ నాయ‌కులు వినూత్న నిర‌స‌న‌