in ,

భాష్యం స్కూల్లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో శనివారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ………. తల్లిదండ్రులతోపాటు పెద్దలను విద్యార్థులు గౌరవించాలని తెలిపారు. గతంలో పిల్లలు తమ అవ్వా తాతల దగ్గర  కథలు, పొడుపు కథలు చెప్పించుకునేవారు ప్రస్తుతం అవి ఇప్పుడు లేదని చెప్పారు. ఇప్పుడు కూడా అవ్వ తాతలు తమ మనవాళ్లు, మనవరాళ్లకు తమ అనుభవాలను, పొడుపు కథలను తెలియజేయాలని తెలిపారు. అవ్వ తాతలు తమ అనుభవాలను పిల్లలకు ముందు పంచుకోవాలని ప్రిన్సిపాల్ చెప్పడంతో పలువురు గ్రాండ్ పేరెంట్స్ తమ అనుభవాలను పిల్లలకు తెలియచేశారు .అనంతరం గ్రాం డ్ పేరెంట్స్ కు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో చాంప్స్ ఇంచార్జ్ అనురాధ, అధ్యాపకులు, గ్రాండ్ పేరెంట్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Written by G.Raju

జిల్లా కలెక్టర్ ను కలిసిన శిక్షణ ఎంపీడీవోలు

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి