in , ,

వినాయక మండపన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 గురు  న్యూస్ విశాఖపట్నం : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు గారీ  ఆహ్వానం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన భారీ వినాయక మండపంను, విశాఖపట్నం,అనకాపల్లి, విజయనగరం,అల్లూరి సీతారామరాజు జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్  టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి గారు సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా విశాఖ అన్ని విధాల అనుకూలమని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు  విశాఖను పరిపాలన రాజదానిగా చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు దసరా రోజు నుండి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని ఆయన అన్నారు.ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలిగి పోవాలని ఈరోజు ఈ వినాయకుని పూజించడం జరిగిందని ఆయన అన్నారు.

Written by Balakishan

బొబ్బర్లంక కాలువలో ముసలి

నేడు మద్యం షాపులు బంద్