- రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని జైలు సూపరింటెండెంట్ రవికిరణ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరు వఎంకటసత్యనఆరఆయణ అనే రిమాండ్ ఖైదీ ఈనెల 6న రాజమండ్రి సెంట్రల్ జైలు కు రావడం జరిగిందన్నారు. అయితే ఈ నెల 7న జ్వరం రావడం స్థానిక జైలు వైద్యులు పరీక్షలు జరిపి చికిత్స నిమిత్తం రాజమండ్రి జనరల్ ఆస్పత్రి కి తరలించడం జరిగిందన్నారు. అయితే అతనిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించగా ఈనెల 20వ తేదిన మరణించినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. కానీ రిమాండ్ ఖైదీ జైల్లో మరణించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు.