-
మట్టి గణపతి ని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
-
ప్రకృతిహితమే పండగల పరమార్థం
-
యువతబాధ్యతగా భావించి పర్యావరణాన్ని పరిరక్షించుకావాలి
-
మట్టి విగ్రహాల వినియోగం పై అవగాహన పెంచేందుకు నడుం బిగించిన ప్రభుత్వ యంత్రాంగం
-
సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం లో
-
కాలుష్య నియంత్ర మండలి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
-
జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఇతర అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మట్టి గణపతి ని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదం తో ప్రతీ ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం లో మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాల పై ప్రజలకు అవగాహనే కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ లతో కలిసి గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు.. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రకృతిహితమే పండగల పరమార్థం అన్నారు.పండగలతో సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిదే అన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉందన్నారు. పండగుల వెనుకున్న లక్ష్యం కూడా అదే అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సునిశితంగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉందన్నారు. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది అన్నారు. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిచ్చి భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు, వాతావరణం ను అందిద్దాం అని పిలుపు నిచ్చారు.వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదన్నారు. ఈ చిన్న విషయాన్ని యువత అర్థం చేసుకుంటే చాలు అన్నారు. మట్టి గణపతి కోసం ప్రతీ ఒక్కరూ గట్టి సంకల్పం తీసుకోవాలని కోరారు.. కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావ్, డిఎస్పీ నాగభూషణం , చివ్వెంల జడ్పీటిసి సంజీవ నాయక్, మారీపెద్ధి శ్రీనివాస్ గౌడ్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*ప్రభుత్వం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ*
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం లో అవరణ లో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, పిసిబి ఈ.ఈ సురేష్ బాబు లు తెలిపారు.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యం లో 2 వేల విగ్రహాలు చిన్నవి, 125 పెద్ద విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు..
[zombify_post]

