సారవకోట, ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన గురువారం తెల్లవారుజామున సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన బొమ్మాళి గణపతిరావు (42) కాలకృత్యాలు తీర్చుకోవడానికి గురువారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రధాన రహదారి మీదుగా గ్రామ చివరనున్న బావి వద్దకు వెళ్లి, అక్కడ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఓ వ్యాన్ వేగంగా వచ్చి గణపతిరావును ఢీకొంది. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని గణపతిరావు భార్య పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పారావు పేర్కొన్నారు. గణపతిరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
[zombify_post]

