రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంగ జంపి రెడ్డి (32 ) అనే సూపర్ మార్కెట్ వ్యాపారి బుధవారం అదృశ్యం అయినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రామాకాంత్ తెలిపారు. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంకిత్ సూపర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్న బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంగ జంపి రెడ్డి ( 32 ) తన ఇంటిలో అతని భార్య కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ప్రొద్దున 9గంటల ప్రాంతంలో తన యొక్క బండి నెంబర్ TS 23 G 0 6 4 0 పై వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని తన చుట్టుపక్కల బంధువులను అడిగిన ఆచూకీ లభించలేదని ఎస్ ఐ రమాకాంత్ కు పిర్యాదు చేసింది.ఆమే పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ పేర్కొన్నారు.అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
[zombify_post]


