అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ నినాదాలు రాజాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా సోమవారం రాజాం పట్టణంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాలను పట్టుకొని ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం,దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు టీడీపీ నాయకులను అనుసరించారు.
[zombify_post]
