in

మేము అధికారంలోకి వస్తం అప్పుడు మీ అవినీతి నీ ప్రజలకు చూపిస్తాం : పితాని

pitani

డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా :

ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మరియు ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు .టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై అక్రమ కేసులు,అరెస్ట్ దారుణం అని అన్నారు.మంత్రి వేణు అధికారం ఉందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలకు తగిన మూల్యం చెల్లించుకోవాలని గుర్తుంచుకో అని అన్నారు .పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్న ఈ మంత్రి వేణు భాగోతం కోనసీమ జిల్లా లో సొంత సామాజిక వర్గంతో పాటు ప్రతీ ఒక్కరికీ తెలుసు లక్షలకోట్లు అవినీతి పాల్పడిన ముఖ్యమంత్రి,కోట్లాది రూపాయలు పదవిని అడ్డుపెట్టుకుని సంపాదించుకున్న మంత్రులు కష్టపడి సంపాదించి ప్రజాసేవకు కర్చుపెడుతున్న పవన్ కళ్యాణ్ ని  విమర్శించే అర్హత లేదని అన్నారు

రానున్న ఎన్నికల తరువాత మేం అధికారంలోకి రావడం కాయం, వచ్చిన వెంటనే మీ అవినీతిని బయటపెట్టి ఒక్కొక్కరి భరతం పట్టడంఖాయమని అన్నారు.ఎల్లప్పుడూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి,శిరసావహించి నడుసుకుంటానని పితాని బాలకృష్ణ అన్నారు.

[zombify_post]

Written by Kiran

శ్రీ చక్ర లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న…బీజేపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

నిశ్చితార్థ వేడుకకు హాజరైన పవార్ రామారావు పాటిల్ గారు…