in , ,

చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలి-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని చింతకుంటలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన హక్కుల కోసం అనాటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ ధైర్యాన్ని రజకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తమ హక్కుల సాధనతోపాటు, బానిస బతుకులు వద్దంటూ చాకలి ఐలమ్మ వెట్టి చాకిరి నిర్మూలన కోసం కృషి చేసిందని, ప్రజల్లో మానసికస్థైర్యం నింపిన, ఆదర్శవనిత, తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్కగా నిలిచిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాకలి ఐలమ్మ సేవలను కొనియాడారు.

[zombify_post]

Written by Harish

బీఎస్పీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు:

విద్యతోపాటు విలువలు పెంచేదే బాలసాహిత్యం