డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరశిస్తూ కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆద్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వుండగా చంద్రబాబునాయుడు ఏ తప్పూ చేయలేదని,చంద్రబాబునాయుడు సభలకు,లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న జనాదరణను పక్కదారి పట్టించాలనే ఈ అక్రమ అరెస్టు చేశారని అన్నారు.తన తండ్రిని కలవడానికి కూడా లోకేష్ కు అనుమతి ఇవ్వకుండా మధ్యాహ్నం వరకూ అడ్డుకుని పోలీసులు జగన్ కు తొత్తులుగా మారారని దుయ్యబట్టారు.అక్రమ అరెస్టులు తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రజాదరణను ఆపలేవని సత్యానందరావు అన్నారు.
ఈకార్యక్రమంలో కొత్తపేట మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
[zombify_post]

