in

ప్రతిపక్షాల దుష్ప్రచారం – కొటగుళ్లి భాగ్యలక్ష్మి

పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా:  గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మెరుగైన పారదర్శకమైన సేవలు అందుతున్నాయని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. గ్రామ సచివాలయాలు, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు, నాడు – నేడు లో పాఠశాల నిర్మాణం ఇవన్నీ అభివృద్ధి కాదా? అని ప్రతిపక్షాలను ఆమె ప్రశ్నించారు. జి మాడుగుల మండలం గెమ్మిలి గ్రామ సచివాలయాన్ని సోమవారం ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేనటువంటి చురుగ్గా పనిచేసే గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. అన్ని డిపార్ట్మెంట్లుఒకే చోట ఉండి పని చేసుకునే విధంగా ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారని చెప్పారు. జి.మాడుగుల మండలంలో ఇప్పటికీ 18 సచివాలయాలకు గాను ఐదు సచివాలయలను ప్రారంభించడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకమైన సేవలు అందుతున్నాయన్న విషయాన్ని తన కంటే ప్రజలకే బాగా తెలుసునన్నారు. పారదర్శకమైన సేవలు అందించేటువంటి వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్గికి గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం జనాలకు డబ్బులు పంచుతుంది తప్ప అభివృద్ధి ఎక్కడ చేస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న దశ ప్రచారాన్ని ఆమె ఖండించారు. వ్యక్తిగతంగా డబ్బులు పంచుతున్నారే తప్ప అభివృద్ధి చేయలేదంటున్న ప్రతిపక్షాలకి రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం రూ.21.80 లక్షలతో నిర్మించిన ఆర్ బి కే రూ.32 లక్షలతో నిర్మించిన వెల్ నెస్ సెంటర్ నాడు – నేడులో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు ఇవన్నీ అభివృద్ధి కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ వ్యక్తిగత ఆస్తులు …ఉమ్మడి ఆస్తులు కాదా అన్న విషయం ప్రతిపక్షాలే చెప్పాలని ఆమె పేర్కొన్నారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా పాఠశాలకు కొత్త భవనాలు నిర్వహించడం పాత వాటికి మరమ్మతులు చేయడం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రహరీ నిర్మాణంతో కూడిన సదుపాయాలు స్కూళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది ప్రజలందరికీ చెందినటువంటి ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి కాకుంటే మరేమంటారో ప్రతిపక్షాలు చెప్పాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రగతిని మెచ్చుకోకపోగా రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న దశ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మత్యారాస వెంకట లక్ష్మి, స్థానిక సర్పంచ్ సీదరి కొండబాబు, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైస్ సర్పంచ్ గెమ్మెలి మురళి, మండల అధ్యక్షులు నర్మని మత్స్యకొండం నాయుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ నాగూర్ బాబు, జి.మాడుగుల సర్పంచ్ కిమ్ముడు రాంబాబు, లువ్వాసింగ్ ఎంపిటిసి గబ్బాడి సన్యాసి దొర,  సొలభం ఎంపిటిసి కూడా చిన్నారావు, సింగర్భ సర్పంచ్ మసాడి గంగరాజు, గెమ్మెలి సచివాలయ కన్వీనర్ కిముడు గణపతి, సింగర్బ సచివాలయ కన్వీనర్ వండ్లపు సూర్య ప్రకాష్ నాయుడు, సర్పంచ్ ఎస్ మాలన్న,  సీనియర్ నాయకులు  వంజరి అప్పలనాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ సాగిన లక్ష్మణ్, మండల మహిళ అధ్యక్షులు నీలమ్మ,  సీనియర్ నాయకులు గెమ్మెలి లక్ష్మీనాయుడు, గెమ్మిలి సింహాచలం, వార్డ్ నెంబర్ ఉగ్రంగి లక్ష్మి , మండల అధికారులు, సచివాలయ సిబ్బంది,  వాలంటీర్లు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

కార్డు ప్రైమ్ రిజిస్ట్రేషన్ ల హడావుడి

స్వర్ణకారుల నిరాహార దీక్షకు సంఘీభావం- బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి