in ,

చిగురుమామిడి ఎమ్మెల్యే ను కలిసిన గొల్ల కురుమ సంఘం సభ్యులు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ గొల్లకురుమ యాదవ సంఘం సభ్యులందరూ అధ్యక్షుడు ముక్కెర సదానందం యాదవ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ ను హుజురాబాద్ లోని సింగపూర్ లోని వారు నివాసంలో ఆదివారం కలిశారు.యాదవ సంఘం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా మొదటిసారి కలవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు 40మంది వరకు వెళ్లి కలిసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా యాదవ సంఘం తరఫున ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేసి గొంగడితో సత్కరించినట్లు చెప్పారు.రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 67యూనిట్లు మంజూరు అయినందున అవి సకాలంలో పంపిణీ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ను సభ్యులందరూ కోరగా దీనికిగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ మీరు డీడీలు కట్టండి నేను అవసరమైతే కలెక్టర్ తో మాట్లాడి త్వరగా వచ్చేలా గ్రౌండింగ్ చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముక్కెర సదానందంయాదవ్,ఉపాధ్యక్షులుముక్కెర మల్లేశం యాదవ్,ప్రధాన కార్యదర్శి అన్న సమ్మయ్య, యాదవ్ డైరెక్టర్లు చౌదరి మనోజ్ కుమార్ యాదవ్,పోతరవేని అనిల్ యాదవ్,కాశవేన రాజు యాదవ్,ముక్కెర మహేశ్వరి యాదవ్,చౌదరి లావణ్య యాదవ్ లతో పాటు 30మంది సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Rakesh

నందిగామ గాంధీ సెంటర్లో టిడిపి నాయకుల నిరసన

రేపటి నుంచి పర్యాటక ప్రాంతం మూసివేత