in , ,

సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టులను సిద్ధం చేయండి

పాడేరు, అల్లూరి జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించే 31 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి గౌరీ శంకర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2023 కు సంబంధించి మంచి ప్రాజెక్టులను విద్యార్థులతో సిద్ధం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ల జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందిన కే.జీ.బీ.వీ పాడేరు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సత్యవతి,రమణమ్మ లను విద్యాశాఖ అధికారి  వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ పి.రమణ మూర్తి నాయుడు, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్. కె. జె రామారావు, రిసోర్స్ పర్సన్ లు మరియు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

పెద్దపల్లి గణేష్ నిమజ్జనం వేడుకలు

డ్రమ్స్ కొట్టిన నారా భువనేశ్వరి