గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయ ఎం.వి.వి సత్యనారాయణ గారు, జీవీఎంసీ అధికారులు మరియు స్థానిక వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ తో కలిసి సామాజిక భవనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ నిధులతో మంజూరైన 25 లక్షల రూపాయల వ్యయముతో ఈ యొక్క సామాజిక భవన నిర్మాణానికి గాను త్వరిత గతిన నిర్మాణం చేపట్టాలని స్థానిక గుత్తేదారులకు గౌరవనీయులు శ్రీ ఎం వి వి గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక జివిఎంసి సిబ్బంది పార్టీ శ్రేణులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.