జగిత్యాల జిల్లా:సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల దీక్షలు జిల్లా కేంద్రంలో యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని దీక్ష శిబిరం ముందు రోడు పైన శ్రీకృష్ణ రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని వేసి వినుత నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్నో రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం తమ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టడానికి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నట్లు తెలిపారు
[zombify_post]


