in ,

శనార్థులు తప్ప శాపనార్థలు తెలియని గొల్లకుర్మలు*_

_గొల్ల కుర్మల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం_

_ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కుర్మల జాతి_:ఎమ్మెల్యే రసమయి

ఇల్లంతకుంట దర్యాప్తు ప్రతినిధి సెప్టెంబర్ 11: ఇల్లంతకుంట మండలంలోని తాళ్లల్లపల్లె  గ్రామంలో గొల్ల, కురుమ సోదరులకు యునిట్లు ఆరెపల్లి గ్రామంలో 19యునిట్లను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్ చేతుల మీదుగ  సోమవారం రోజున గొర్రెలను పంపిణీ చేశారు.అనంతరం రసమయి మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ గొల్ల కురుమల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని,గత ప్రభుత్వాలు గొల్ల కురుమల సంక్షేమాన్ని మరిచాయని,ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో   ముఖ్యమంత్రి కేసిఆర్  సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు.తెలంగాణ రాకముందు గొల్ల-కురుమల పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని అని అన్నారు.తాతలనాటి కులవృత్తులు కూడా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలి అని అన్నారు.ఆర్థికంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్‌కి గొల్ల కురమలు మద్దతు నిలవాలి అని అన్నారు.నాడు న్యాయం, ధర్మం పాండవుల వైపు ఉన్నందునే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడని అన్నారు.దేశంలోనే మొట్ట మొదటి సారిగ గొల్లకురుమల ఆర్థికస్వావలంభన కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్  గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌  గొల్ల కురుమలు కులవృత్తి మరవకూడదన్న ఉద్దేశంతో రాయితీపై గొర్రెపిల్లలను పంపిణీ చేస్తున్నారని అన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓ వైపు రైతాంగానికి, మరోవైపు ఇతర కులాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు కేసీఆర్‌ అండగా నిలిచారని అన్నారు.సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

మూడు చక్రాల సైకిల్*”