గురు న్యూస్ విశాఖపట్నం :మాజీ టీటీడీ చైర్మన్ & ఉత్తరాంద్ర వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ వై వి, సుబ్బారెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసరు,విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు.ఈ సందర్బంగా నియోజకవర్గం సమస్యలని వైవీ సుబ్బారెడ్డి కి వివరించినట్టు అయన తెలిపారు. ఇందులో భాగంగా అనకాపల్లి సత్యనారాయణ పురంలో మంజూరు చేసిన 1214 టిడ్కో ఇళ్ళు రద్దు చేసిన కారణంగా వారికి బదులుగా అర్హులైన వారందిరికి ఇల్లు మంజూరు చేయాలనీ కోరారు. వైసీపీ పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసే కార్యకర్తలుకు స్టేట్ & జిల్లా కమిటీ లలో ఉన్నతమైన, ప్రాధాన్యత కలిగిన పదవులు ఇవ్వాలని కోరారు వాసుపల్లి గణేష్.నిత్య అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు గారికి వైస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు అయన తెలిపారు సమస్యలు పరిష్కరించాలని కోరగా సానుకూలంగా వైవీ సుబ్బారెడ్డి స్పందించారాని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు.