in ,

రైతు బిడ్డకు డాక్టరేట్

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

ఆయనొక సాధారణ రైతు. తన ఇద్దరు బిడ్డలను ఉన్నత చదువులు చదివించి పలువురుకు ఆదర్శంగా నిలిచారు. కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన సాధారణ రైతు కొత్తపల్లి గనిరాజు పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు డిగ్రీ వరకు చదివి వ్యవసాయంలో వ్యవసాయ శాఖ అధికారులు చూసనల ప్రకారం ఆధునిక వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలవగా, చిన్న కుమారుడు కొత్తపల్లి వీరబ్బాయి ఇంజనీరింగ్ చదువులో పట్టా తీసుకొని రాజనగరంలో గల బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విభాగాధిపతిగా మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో సహాయక అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగుల ఉత్పాదకతపై శిక్షణ, అభివృద్ధి, ప్రభావం అంశాలపై రాజమండ్రి ఓఎన్జిసిలో అధ్యయనం చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇతనికి విశాఖపట్నం చెందిన బి మురళీకృష్ణ గైడ్ గాను, ఎన్ సాంబశివరావు కో గైడ్ వ్యవహరించారు. వీరిని పలువురు నాయకులు అభినందించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

అమలాపురం ఆర్డీవో గా జి కేశవర్ధన రెడ్డి

జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు