in ,

రేపు డుంబ్రిగూడ లో స్పంద‌న

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

*

పాడేరు సెప్టెంబ‌రు 28 :  ఈనెల 29 వ తేదీ శుక్రవారం  డుంబ్రిగూడలో  జ‌గ‌న‌న్న‌కు చెబుదాం ప్ర‌త్యేక స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్నట్లు  జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్   కుమార్    ప్రకటించారు.  డుంబ్రిగూడ ఎంపిడిఓ  కార్యాల‌యంలో నిర్వ‌హించే స్పంద‌న‌కు జిల్లా అధికారులు విధిగా హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. స్పంద‌న కార్య క్ర‌మం ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగు తుంద‌న్నారు. అనంత‌రం  శాఖాధికారులు సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బందితో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.

పాడేరు ఐటీడీఏ స్పందన రద్దు

శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం లో నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండలం స్థాయి అధికారులు అందరూ డుంబ్రిగూడ స్పందన లో పాల్గొంటున్నందున్న ఈ స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు.

చంద్రబాబు కోసం సంతకాల సేకరణ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు

ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర