టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం రాజమండ్రి కేంద్రకారాగారంలో కలవనున్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తండ్రి అరెస్టైన రెండు రోజులకు ఢిల్లీకి వెళ్లిన లోకేశ్ అక్కడ న్యాయవాదులు, పలువురు నేతలతో వరుసగా భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగే సమయానికి తిరిగి ఢిల్లీకి వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.