ముంపుకు శాశ్వత పరిష్కారం చూపాలి: జనసేన పార్వతీపురం పట్టణానికి ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్లు జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకటరావును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి పట్టణం ముంపుకు గురైన సందర్భాన్ని చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలపై ఆక్రమణలు జరగటం మూలంగా వరద నీరు రోడ్డుపైకి వచ్చి ముంపుకు కారణం అవుతుందన్నారు.
[zombify_post]

