in

బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నిర్మాలకుమారికి ఘన సత్కారం

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాలెం సెంటర్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని మానుకొండ నిర్మలా కుమారి ని ఈ ఏడాది బెస్ట్ టీచర్ గా ప్రభుత్వం గుర్తించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక కుమ్మరి గరువు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కత్తుల చిట్టిబాబు ఆధ్వర్యంలో స్థానికులు ఘనంగా సత్కరించారు. బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నిర్మలా కుమారి చిట్టి మోజస్ దంపతులను శాలువా తో సత్కరించి, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొండేటి నాగ వెంకట దుర్గా రమణ, విద్యార్థుల తల్లిదండ్రులు రాయుడు కృష్ణకుమారి, వాకా మోహన జయ సింహాద్రి, ఉడపా సునీత, ఉడపా భారతి, కొండేటి మణిశ్రీ, పొడి వరలక్ష్మి ,కొల్లాబత్తుల రవి, పరసా కోమలి నాగ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Written by Kiran

అనకాపల్లి జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలి,

చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఏలూరు లో దీక్షలు