-ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్.
దర్యాప్తు ప్రతినిధి ఇల్లంతకుంట సెప్టెంబర్ 9: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో సుదగోని స్వప్న శ్రీనివాస్ కి ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ( పిఎమ్ఎఫ్ఎమ్ఈ) పథకం ద్వారా ఏర్పాటు చేసిన పిండి గిర్నిని ఏపీఎం వాణిశ్రీ తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడం కోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ అందిస్తుందని అన్నారు.. మహిళా సంఘాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి , ఏపిఎం వాణిశ్రీ , వీవో అధ్యక్షురాలు మౌనిక, సిసి రాంచంద్రారెడ్డి, సదయ్య, వెంకటేశం ఓబీలు ,వివోఏ లు సుజాత, పద్మలత, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]

