గురు న్యూస్ విశాఖపట్నం :విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 41వార్డు ఙ్ఞానాపురం జెఎన్ఎన్యుఆర్ఎం కోలనీ నందు ఉన్న చేపల మార్కెట్ కి అదనపు వసతులు కల్పించడానికి ₹.4,90,000/- వ్యయం తో కూడిన పనికి శంకుస్థాపన చేశారు, విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ చేపల మార్కెట్ లేక రోడ్లపై విక్రయిస్తున్నారని, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చేపల మార్కెట్ అందుబాటులోకి వేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు 41వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీస్ ఇంచార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వెలంగిణీ రావు, కన్వీనర్లు అన్నపూర్ణ, దేవి, ఈశ్వరి, చుక్క శ్యామ్ సుందర్, రాజాన శ్రీనివాస్, గృహసారథులు నారాయణ రావు, కమల్ కుమార్, కొట్నీ ప్రసాద్, ప్రభాత్, కళ్యాణ్, ఆనంద్, తిరుమల రావు, మని, విజయ, వరలక్ష్మి, మేరీ, పద్మ, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.