in ,

ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలి

వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతం వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై మహేందర్ అన్నారు.బోయినపల్లి మండలం నిలోజిపల్లి లో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామస్థుల తో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిమజ్జన  సమయంలో డీజేలకు అనుమతులు లేవని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే  చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెరువుల వద్దకు కుంటల వద్దకు చిన్న పిల్లలను తీసుకెళ్లద్దని సూచించారు పోలీసులు సూచించిన విధంగా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద నిమజ్జన సమయంలో డీజీలకు అనుమతులు లేవని అన్నారు. యువత గంజాయి మత్తులో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు ఎవరైనా గంజాయి కి బానిస అయినవారు ఉంటే ప్రత్యేక వైద్యుని పర్యవేక్షణలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్సై వెంట సిబ్బంది కోటి ,రమేష్ తదితరులు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

గడపగడపలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కిఆదరణ

నూతన పెన్షన్ దారులకు పెన్షన్ ను పంపిణీ చేసిన హోంమంత్రి డా.తానేటి వనిత