in ,

పొలిటికల్ న్యూస్

  • న్యూస్, టుడే విశాఖపట్నం : లాసన్స్ బే కాలనీ 20వార్డు పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళన,సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న, తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎంపీ, శ్రీ ఎం వి వి సత్యనారాయణ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ , ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని, ఆయన పేర్కొన్నారు . లాసన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో 20 వార్డు వైసిపి పార్టీ నాయకులు, ముఖ్య నాయకులతో వార్డ్ కార్పొరేటర్ల లక్ష్మి సురేష్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికలకు విజయం గా పరిగణించవచ్చని,వేల్లడించారు. కనుక ప్రతి ఒక్క కార్యకర్త వార్డు స్థాయి నుంచి నియోజకవర్గములో  రానున్న ఎన్నికలలో విజయానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 20 వార్డులో ఎనలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యంలోజరిగాయని గుర్తు చేశారు. కార్యక్రమములో  వార్డు సీనియర్ నాయకులు, వార్డు యూత్ సభ్యులు, పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

ఎమ్మెల్యే ని కలిసిన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు

టిడిపి బందుకు కనిపించని జనసేన మద్దతు