రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలోనీ పొత్తూరి సురేష్ బాబు రేషన్ డీలర్ నివాసంలో ఆయన తండ్రి అయిన పొత్తూరి రాజయ్య మరణించి 6నెలలు గడిచినా బాధ వేళల తన జ్ఞాపకార్థం పేపర్ బ్యాగులను రేషన్ వినియోగదారులకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా పోత్తూరు సురేష్ బాబు రేషన్ డీలర్ మాట్లాడుతూ తన తండ్రి బోయిన్ పల్లి గ్రామ ప్రజలకు రేషన్ డీలర్ గా ఎన్నో సేవలు అందించారని వారి సేవలను గుర్తించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడానికి ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. అలాగే ముందు ముందు కూడా తన జ్ఞాపకార్థం మరెన్నో సేవ కార్యక్రమాలు చేపడతనని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి తల్లి నర్శవ్వ,కుమార్తె గుడిసె శ్రీలత, కుటుంబ సభ్యులు పొత్తూరి నర్స్యయ, మహేందర్,రాజేంద్ర ప్రసాద్, ఏడపల్లి సంధ్య, కార్డు దారులు , మునేధర్, చంద్రశేఖర్, నర్సవ్వ, భూమయ్య,శ్రీను, దేవయ్య,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
[zombify_post]


