in ,

ప‌ది విద్యార్దుల‌కు రేపు రాత ప‌రీక్ష‌

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

పాడేరు  అక్టోబ‌రు 5 :  గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువు తున్న విద్యార్దిని విద్యార్దుల‌కు   ఈనెల 6 వ తేదీ రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నామ‌ని   ఐటిడి ఏ  పిఓ  వి. అభిషేక్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ జేసారు. రాత ప‌రీక్ష స్థానిక లోచ‌లిపుట్టు  ప్ర‌భుత్వ గిరిజ‌న సంక్షేమ బాలురు పాఠ‌శాల‌-1,లో  180 మంది బాలుర‌కు, శ్రీ‌కృష్ణా పురం  గిరిజ‌న సంక్షేమ బాలిక‌ల పాఠ‌శాల‌లో 140 మంది బాలిక‌ల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌న్నారు. రాత పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు. రాత ప‌రీక్ష‌లో ఉత్త‌మ  ఫ‌లితాలు సాధించిన విద్యార్దుల‌కు  ప‌ద‌వ త‌ర‌గ‌తి లో 10/10  మార్కులు సాధించే విధంగా ప్ర‌త్యేక  శిక్ష‌ణ అందిస్తామ‌ని పేర్కొన్నారు. విద్యార్దినీ , విద్యార్దులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని  కోరారు.

అట్రాసిటీ కేసుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి