in ,

నేడు వెంచర్ మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పర్యటన

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి తో కలిసి వేంసూరు మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుద్దేపూడి, కందుకూరు, భరణిపాడు, వెంకటాపురం, మర్లపాడు, వేంసూరు, భీమవరం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సత్తుపల్లిలోని ధోబిఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మునిసిపల్ చైర్ పర్సన్ కూసంపూడి మహేష్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా స్థానిక మెట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్సీ

గణేష్ నవరాత్రి ఉత్సవల్లో అన్నదానం