స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కస్టడీ ఆదివారం తో ముగియనుంది. ఈ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు ను మొదటి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ కోర్టు ను కొరగా రెండు రోజుల పాటు చంద్రబాబు ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు లో సీబీఐ అధికారులు చంద్రబాబు ను విచారించారు. ఆదివారం కూడా విచారణ జరిపి ఆ నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ ఆరా లేదా బెయిల్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు సమాచారం.