వేపాడ మండలం కుంపల్లిలో నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లు 19 మందికి ఎంపీపీ డి. సత్యవంతుడు చేతుల మీదుగా స్థానిక సచివాలయంలో శనివారం అందజేశారు. అర్హత గల ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించే ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.
[zombify_post]
