in ,

నిరుద్యోగ యువతి ప్రవళికది- KCR ప్రభుత్వ హత్యనే

*నిరుద్యోగ యువతి ప్రవళికది- KCR ప్రభుత్వ హత్యనే:*

 PDSU జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ PDSU ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ ముందు  నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి PDSU జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు KCR ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణియే కారణమని PDSU జిల్లా  అధ్యక్షులు సింగారి వెంకటేష్ ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం,TSPSC నిర్వాహకo వల్ల నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన ప్రవళిక హైదరాబాద్ లో హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దురదృష్టకరమని,KCR ప్రభుత్వం గతంలో పేపర్ లీకేజీ లు ఇప్పుడు గ్రూప్ 2, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయడం వల్ల ప్రవళిక ఇక ఉద్యోగం రాదు అనే ఆందోళన కు గురై బలవన్మరణానికి పాల్పడింద ని, ప్రవళికది KCR ప్రభుత్వ హత్యనే అని వెంకటేష్ ఆరోపించారు ప్రవళిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల ఏక్స్ గ్రే సియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి,నిరుద్యోగులు రాబోవు ఎన్నికల్లో KCR ప్రభుత్వానికి ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు. నిరుద్యోగ విద్యార్థి మిత్రులారా ఆత్మహత్యలు వద్దు ఉద్యమాలు పోరాటాల ద్వారా కెసిఆర్ ప్రభుత్వాన్ని  గద్దరించుదామని  అన్నారు.  ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు దిగంబర్, మున్నా, రమేష్,రవి తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Srikanth

చిరు వ్యాపారస్థులకి అండగా వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు