in ,

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాకవి   కాళోజీ నారాయణరావు గారి జీవిత చరిత్రను ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. కాళోజీ జీవితములో తెలంగాణ కోసం పోరాడిన విధానం, ప్రజాకవిగా గుర్తింపు తెచ్చుకున్న విధానం పై విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన రిషాసిద్దిక, గంగాభవాని, రస్మిత విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మంచె రమేశ్ మాట్లాడుతూ  అన్యాయాన్ని , అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించి తన రచనలతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిల్చిన మరియు పలుకు బడుల భాషకు పట్టం కట్టాలని నినాదించాడని, ప్రజల్లో చైతన్య దీపం వెలిగించి, జీవితాంతం వారి గొంతుకగా బతికిన ప్రజా కవి కాళోజి గారిని తెలిపారు. వారికి నివాళులర్పించారు. జిల్లా క్యాబినెట్ సభ్యుడు లయన్ తీపిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "నా గొడవ" అనే వ్యాస సంపుటి ద్వారా ఎన్నో విషయాలను వ్యక్తపరిచి అందరివాడయ్యారని, వారి జన్మదినమైన నేడు తెలంగాణ భాషాదినొత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో  సెక్రెటరీ లయన్ బండి యాదగిరి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు లయన్ అంబటి శంకర్, ఉపాద్యాయులు  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

వివాహిత అదృశ్యం.. పోలీస్ కేసు నమోదు*”

చంద్రబాబు అరెస్టు కు నిరశనగా టీడీపీ శ్రేణులు ఆందోళన