రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*న్న
రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, ఆర్డీఓ లు, ఆనంద్ కుమార్, మధు సూదన్ జిల్లా రజక సంఘాల నాయకులు వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు. నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. అనంతరం రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు సత్పలితాలనిస్తున్నాయని చెప్పారు. సబ్బండ కులాల జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకంగా అభివృద్ధి పరుస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, రజక సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!